News February 25, 2025

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11,100 పలకగా, దీపిక మిర్చి రూ.17,500 ధర పలికాయి. అలాగే ఎల్లో మిర్చికి రూ.19 వేలు, టమాటా మిర్చికి రూ.31,0111, సింగిల్ పట్టి రూ.31 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. గమనిక: రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా ఐదు రోజుల సెలవులు.

Similar News

News November 9, 2025

ఏలూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

image

ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులపై శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా హెవీ వాహన డ్రైవర్లకు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రివేళల్లో లాడ్జీలు, బస్సు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీసి, అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించారు.

News November 9, 2025

జెమీమా, షెఫాలీ.. భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

image

ఉమెన్స్ ODIWC విజయం తర్వాత జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ 2-3 రెట్లు పెరిగినట్లు కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ‘జెమీమా ₹60 లక్షల నుంచి ₹1.5 కోట్లు, షెఫాలీ ₹40 లక్షల నుంచి ₹కోటి కేటగిరీకి చేరారు. మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.

News November 9, 2025

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద అప్టేట్

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.