News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు‌ అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

నిజాం హింసలకు సాక్ష్యం రాయికల్ ఠాణా

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో ఉన్న పాత పోలీస్ ఠాణా, నిజాం కాలంలో జరిగిన హింసలకు నిలువెత్తు సాక్ష్యం. దొరలు, రజాకార్ల చిత్రహింసలకు ఈ భవనం వేదికగా నిలిచింది. ఇనుప చువ్వల గదులు, ఇనుప మంచాలతో రూపొందించిన ఈ బందీఖానాలో పోరాట యోధులను చిత్రవధ చేశారు. ఈ భవనంపై ప్రజలు అనేకసార్లు దాడులు చేసి నిజాంను ఎదిరించారు. నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఈ భవనం నాటి చరిత్రకు గుర్తుగా నిలుస్తోంది.

News September 17, 2025

రజాకార్లపై రాములపల్లి ప్రజల పోరాటం

image

తెలంగాణ విమోచన పోరాటంలో భాగంగా 1947లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి, ఎలబోతారం గ్రామాల ప్రజలు రజాకార్లపై తిరుగుబాటు చేశారు. భూలక్ష్మి అమ్మవారి గద్దె వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ప్రాణాలైనా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆగస్టు 12న హుజురాబాద్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారు. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఒడిసెలు, రాళ్లతో దాడి చేసి ఒక పోలీసు అధికారిని హతమార్చారు.

News September 17, 2025

HYD: ఏడీఈ ఇంట్లో నేడు కొనసాగనున్న సోదాలు

image

ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు. కాగా, HYDతో పాటు నల్లగొండ, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో కొనసాగిన సోదాల్లో పట్టుబడిన ఆస్తుల వివరాలు ACB అధికారులు వెల్లడించలేదు. సోదాలు నేడూ కొనసాగనున్నాయి.