News February 25, 2025
హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 27, 2025
‘మేకపోతుల బలి’ రాజకీయం!

AP: ఈ నెల 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల YCP కార్యకర్తలు, అభిమానులు మేకపోతులను బలి ఇచ్చారు. వాటి రక్తాన్ని జగన్ ఫ్లెక్సీలపై చల్లుతూ, రప్పారప్పా నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇవాళ తూ.గో. జిల్లాలో ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సినిమా రిలీజ్‌ల సందర్భంగా హీరోల ఫ్లెక్సీలపై రక్తం చల్లితే తప్పు లేదా అని వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
News December 27, 2025
NZB: రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లా గురుకుల విద్యార్థుల ప్రతిభ

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కల్చరల్ కార్నివాల్ లో ఉమ్మడి NZB జిల్లా గురుకుల ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారని సీనియర్ ప్రిన్సిపాల్ కేతావత్ గోపీచంద్ తెలిపారు. లోకేశ్ రెడ్డి, ఎస్.మహేశ్ బాబు, పి.వర్ధన్ వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచారన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చడం ఉమ్మడి జిల్లాకు గర్వకారణమన్నారు.
News December 27, 2025
పెరిగిన ట్రైన్ ఛార్జీలు.. SKZR-సికింద్రాబాద్‌కు ఎంతంటే..?

రైల్వే శాఖ ఛార్జీలను పెంచింది. 215 KMలకు పైగా ట్రావెల్ చేసేవారిపై KMకు పైసా చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 315 KMల దూరమున్న SKZR- సికింద్రాబాద్(భాగ్యనగర్, ఇంటర్సిటీ) ట్రైన్లకు మొన్నటివరకు రూ.110 టికెట్ ధర ఉండగా పెరిగిన ధరతో అది రూ.120కు చేరింది. సూపర్‌ఫాస్ట్ ఛార్జ్ రూ.135కు, వందే భారత్ రూ.785 నుంచి రూ.810కు పెరిగాయి.


