News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మామునూరు భాస్కర్(46)ను అతడి కొడుకు‌ అరుణ్(22) కత్తితో పొడిచాడు. భాస్కర్‌ను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 1, 2026

రామగిరి: అరగంట వ్యవధిలో తండ్రీ, కుమారుడి మృతి

image

పెద్దపల్లి(D) రామగిరి(M) నాగేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రెండు సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఎరుకల రాజేశం(60) గురువారం మధ్యాహ్నం మృతి చెందగా, కుమారుడు శ్రీకాంత్ (37) అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కొడుకులు అరగంట వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది.

News January 1, 2026

జగిత్యాల: ‘2026లో మరింత సమర్థవంతమైన పోలీసింగ్’

image

నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 2025లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించిందని అన్నారు. 2026లో మరింత అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి నేరాలను నియంత్రించాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

News January 1, 2026

యూరియా నిల్వలు పుష్కలం: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: యూరియా కొరత లేదని, 2 లక్షల టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 4 లక్షల టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులు ఎరువుల కోసం తెల్లవారుజామునే చలిలో క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది.