News March 21, 2024
ఐఆర్ఎస్ To ఉద్యమం To పాలిటిక్స్

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హరియాణాలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1999లో ఐఆర్ఎస్కి ఎంపికయ్యారు 1999-2000ల మధ్య పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 2011లో అన్నా హజారేతో కలిసి జన లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడి జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. 2012లో AAPని స్థాపించి రెండు సార్లు సీఎం అయ్యారు.
Similar News
News April 17, 2025
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ డివైజ్‌లు డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు IOS ఇనాక్టివిటీ రీబూట్ ఫంక్షన్ తరహాలో కొత్త ఫీచర్ రానుంది. 3 రోజులపాటు ఫోన్ లాక్ అయి ఉండడం లేదా ఉపయోగించకుండా ఉంటే ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయి హై సెక్యూరిటీ మోడ్‌లోకి వెళ్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు డిసేబుల్ అవుతాయి. ఫోన్ మళ్లీ వాడాలంటే పాస్ కోడ్ ఎంటర్ చేయాలి. గూగుల్ ప్లే సర్వీసెస్ వెర్షన్ 25.14తో ఈ ఫీచర్ రానుంది.
News April 17, 2025
భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,10,100గా ఉంది. అతి త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
News April 17, 2025
మత్స్యకారులకు డబుల్ ధమాకా

AP: రాష్ట్రంలోని మత్స్యకారులకు వేట నిషేధ భృతి రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలకు మరో రూ.10 వేలు కలిపి రూ.20 వేలు ఇవ్వాలని భావించింది. దీంతో 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 26న లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. కాగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో జీవన భృతితోపాటు బియ్యం అందించనుంది.