News February 25, 2025
పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 14, 2026
ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.
News January 14, 2026
APPLY NOW: BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in
News January 14, 2026
BJP ఎంపీలు, ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్!

మున్సిపల్ ఎన్నికల వేళ TBJP శ్రేణులకు అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చింది. మున్సిపల్ పోరు పార్టీ గుర్తుపై జరుగుతుందని, MPలు, MLAలు క్షేత్రస్థాయిలో సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించింది. GP జోష్‌తో ఇప్పుడు పట్టణ కోటలపై జెండా పాతాలని పక్కా ప్లాన్ వేసింది. ‘BRS, రాష్ట్ర సర్కార్ విఫలమైంది.. BJPకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రచార బరిలోకి దిగనుంది.


