News February 25, 2025
HYD: జూ పార్క్‌లో టికెట్ ధరలు పెంపు

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.
Similar News
News September 16, 2025
అంకుడు కర్ర పెంపకానికి చర్యలు: అనకాపల్లి కలెక్టర్

మంగళగిరిలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టరు విజయ కృష్ణన్ మాట్లాడుతూ.. ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్రను జిరాయితీ భూముల్లో పెంపకమునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో NREGS నిధుల ద్వారా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం షెడ్లకు అనుమతులు ఇవ్వాలని సీఎంను కోరారు. సీఎం చంద్రబాబు అంకుడు కర్ర పెంపకం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News September 16, 2025
పెళ్లిపై మరోసారి స్పందించిన జాన్వీ కపూర్

తన పెళ్లిపై స్టార్ హీరోయిన్ జాన్వీ మరోసారి స్పందించారు. ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమెకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ‘ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్‌లో ఉన్నట్లు టాక్.
News September 16, 2025
చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.