News February 25, 2025

జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు: అనకాపల్లి ఎంపీ 

image

జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కమిటీలో సభ్యుడైన సీఎం రమేశ్ సమావేశంలో పాల్గొని బిల్లుపై చర్చించారు. దేశంలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఖర్చు ఆదా అవుతుందన్నారు.

Similar News

News July 7, 2025

కరీంనగర్: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది కరీంనగర్ జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712670759 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News July 7, 2025

డార్క్ చాక్లెట్‌ తినడం వల్ల లాభాలు!

image

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. కానీ, డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
*రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
*యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
*జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గుతుంది
*జీర్ణక్రియ మెరుగవుతుంది
*వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
*మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది

News July 7, 2025

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన

image

తోతాపురి మామిడి రైతులకు మన ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర ఇతర రాష్ట్రాలకే ఆదర్శమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 5వ తేదీ నుంచే రైతులకు అదనంగా రూ.4(కేజీకి) చెల్లిస్తున్నట్లు చెప్పారు. ధరలను పర్యవేక్షించడానికి ఉద్యాన, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రైతు నుంచి చివరి వరకు మామిడి కొనుగోలు చేస్తామన్నారు.