News March 21, 2024
మందస: ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్
మండలంలోని భోగాపురం పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ అగ్గున్న దేవేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకుడు జివి.చిట్టిరాజు గురువారం తెలిపారు. దేవేంద్ర రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ దాన్ని ధ్రువీకరించారు. దీంతో దేవేంద్రను సస్పెండ్ చేశారు.
Similar News
News November 24, 2024
SKLM: డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా.. అభ్యర్థుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా డీఎస్సీకి ఎటువంటి నోటిఫికేషన్ కు నోచుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈనెల నాలుగవ తేదీన టెట్ ఫలితాలు కూడా విడుదల కాగా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 16 వేల పోస్టులకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 400 పోస్టులకు పైగా భర్తీ చేయనున్నారు.
News November 23, 2024
శ్రీకాకుళం: ‘రూ.20 లక్షలతో బిజినెస్ పెట్టండి’
శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాలలో అగ్రి క్లినిక్స్ & అగ్రి బిజినెస్ సెంటర్స్ (ACABC) స్కీమ్‌పై నాబార్డ్ జిల్లాస్థాయి వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. నాబార్డ్ డీడీఎం రమేశ్ కృష్ణ మాట్లాడుతూ.. అగ్రి గ్రాడ్యూయేట్లు ఈ పథకం ద్వారా రూ.20 లక్షలతో బిజినెస్ చేస్తే రూ.8.8 లక్షల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మి, అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.
News November 23, 2024
IESలో సిక్కోలు వాసికి మూడో ర్యాంక్
ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్(IES) పరీక్షలో సిక్కోలు జిల్లా వాసి సత్తాచాటారు. పోలాకి మండలం జిల్లేడు మాకివలసకు గొల్లంగి సతీశ్ పరీక్ష రాయగా శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఆయన మూడో ర్యాంక్ సాధించారు. ఇదే పరీక్షల్లో గతేడాది 15వ ర్యాంకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన తన తల్లి నిర్మలమ్మ అండగా నిలవడంతో ఈ విజయం సాధించానని ఆయన తెలిపారు.