News February 25, 2025

హనుమకొండ: తండ్రిని చంపిన కొడుకు.. కారణమిదే..!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తిని అతడి కొడుకు అరుణ్ కత్తితో పొడిచి <<15578307>>చంపిన విషయం<<>> తెలిసిందే. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. భాస్కర్ తరచూ తాగొచ్చి భార్యను తిడుతూ, గొడవ పడుతూ ఉండేవాడు. ఈక్రమంలో పిల్లలను, తల్లిని అంతు చూస్తా అని బెదిరించాడు. దీంతో క్షణికావేశంలో చిన్నకొడుకు అరుణ్ పక్కనే ఉన్న కత్తితో తండ్రిని పొడిచాడు. పెద్దకొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News November 16, 2025

KNR: మహిళా డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

image

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025 -26 విద్యాసంవత్సరం పీజీ కోర్సుల్లో ఖాళీల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రో.డి.వరలక్ష్మి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఎంకాం, ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ సా. 5గం.లలోపు అందజేయాలని సూచించారు. 18వ తేదీన సీటు కేటాయించనున్నట్లు తెలిపారు.

News November 16, 2025

KNR: ప్రశాంతంగా డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 5వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 9999 విద్యార్థులకు గాను 9722 మంది విద్యార్థులు హాజరయ్యారు. 277 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 3వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 8676 విద్యార్థులకు గాను 8425 మంది విద్యార్థులు హాజరయ్యారు. 250 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

News November 16, 2025

జగిత్యాల: పలువురు ఎస్‌ఐలకు కొత్త పోస్టింగ్‌లు

image

జగిత్యాల జిల్లాలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురి SHO పి.ఉదయ్ కుమార్‌ను వెల్గటూర్ SHOగా, జగిత్యాల రూరల్ SHO ఎన్.సదాకర్‌ను జగిత్యాల DCRBకి, వెల్గటూర్ SHO ఆర్.ఉమాసాగర్‌ను జగిత్యాల రూరల్ SHOగా బదిలీ చేశారు. భీమ్గల్ PS SI–I జి.మహేష్‌ను ధర్మపురి SHOగా నియమించారు. బదిలీ అయిన ఎస్‌ఐల రిలీవ్ తేదీలను వెంటనే రిపోర్ట్ చేయాలని SP సూచించారు.