News February 25, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

 ➤ గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్ 
➤ యూజీసీ నెట్లో అన్నవరం యువకుడి ప్రతిభ 
➤ నిందితుల గుర్తింపునకు యాప్: రాజవొమ్మంగి ఎస్సై 
➤ జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు: రంపచోడవరం ఐటీడీఏ పీవో 
➤ రహదారి సౌకర్యం కల్పించాలని అనంతగిరి గిరిజనుల పాదయాత్ర 
➤ జీకే వీధి మండలంలో ఊరంతా ఏకమై రోడ్డు నిర్మాణం 
➤ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో వైన్ షాపులు క్లోజ్

Similar News

News September 17, 2025

బాపట్లలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్

image

ఆరోగ్యకరమైన మహిళలు – బలమైన కుటుంబం లక్ష్యంతో చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం బాపట్లలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరిక్షలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.

News September 17, 2025

రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.

News September 17, 2025

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: GWL కలెక్టర్

image

జోగులాంబ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. ఈ నెలలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.