News February 25, 2025
బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శిని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటిపన్ను రశీదులు ఆన్లైన్ చేయకుండా తప్పుదోవ పట్టించారనే విషయమై విచారణ అనంతరం చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 9, 2026
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.
News January 9, 2026
సిద్దిపేట: ‘ఎలక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చేయాలి’

సిద్దిపేట కలెక్టరేట్ నుంచి ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ గూర్చి ఆర్డీఓ, తహశీల్దార్, సూపర్ వైజర్, బిఎల్ఓలతో కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆయా మండలాల వారిగా మ్యాపింగ్‌లో వెనకబడిన బిఎల్ఓలతో సమీక్షించారు. జిల్లాలో ఎలక్టోరల్ మ్యాపింగ్ 100 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 9, 2026
ఇకపై షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు, బైక్ కొన్నప్పుడు RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. RC నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే వచ్చేస్తోంది. ఈ సౌకర్యం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.


