News February 25, 2025

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్

image

ఇంటర్మీడియట్, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకునేందుకు బస్సులను ఆయా రూట్లలో నడపాలని సూచించారు.

Similar News

News November 9, 2025

హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్‌ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్‌లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

News November 9, 2025

నిట్ వరంగల్‌లో ఉచిత GATE శిక్షణకు దరఖాస్తులు

image

వరంగల్ నిట్‌లో ఉచిత GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులు శిక్షణలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కోచింగ్ అన్ని ఇంజినీరింగ్ విభాగాలను కవర్ చేస్తూ 17 నవంబర్ 2025 నుంచి 9 జనవరి 2026 వరకు 8 వారాల పాటు కొనసాగుతుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 9, 2025

నవీన్ యాదవ్ రౌడీ కాదు: CM రేవంత్

image

నవీన్ యాదవ్ రౌడీ కాదని CM రేవంత్ రెడ్డి అన్నారు. B.Arch చేసి, ప్రజా సేవలో ఉన్న యువకుడు నవీన్ అంటూ CM పేర్కొన్నారు. ‘తన తండ్రిని చూసి రౌడీ అన్ని ముద్ర వేస్తున్నట్లు నవీన్ యాదవ్ ఇప్పటికే చెప్పారు. పాస్‌పోర్టు బ్రోకర్ కొడుకు ఏం అవుతారని కూడా ఆయన నిలదీశారు. దీనిపై BRS సమాధానం చెప్పాలి. టికెట్ ఇచ్చిన అని నేను ఏం చెప్పడం లేదు. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెబుతారు’ అని CM రేవంత్ తెలిపారు.