News February 25, 2025

KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!

image

శాసన మండలి ఎన్నికలకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కోసం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్లలో పట్ట భద్రుల ఓటర్లకు 29, ఉపాధ్యాయులకు 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించి సామాగ్రి కామారెడ్డిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులకు ఇప్పటికే రెండు దశల్లో శిక్షణ ఇచ్చారు.

Similar News

News February 26, 2025

వనపర్తికి సీఎం రాబోతున్నారు..!

image

వనపర్తికి మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరోజు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం ఇచ్చారన్నారు. ఎంపీ మల్లు రవి, ఒబెదుల్లా కోత్వాల్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు తదితరులు సీఎంను కలిశారన్నారు.

News February 26, 2025

నాటుసారా రహిత జిల్లాగా తయారు చేద్దాం: అనంత కలెక్టర్

image

నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.

News February 26, 2025

MBNR: పునరావాస పనుల్ని వేగవంతం: కలెక్టర్

image

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసపనుల్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఉదండపూర్ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల పునరావాస పనులపై సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా పునరావస్తు కేంద్రాల్లో పనులను వేగవంతం చేసి వారికి అప్పగించాల్సిందిగా ఇరిగేషన్ ఇతర శాఖలకు కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!