News February 25, 2025
నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్‌లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు
Similar News
News February 26, 2025
MBNR: పునరావాస పనుల్ని వేగవంతం: కలెక్టర్

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసపనుల్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఉదండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరావాస పనులపై సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా పునరావస్తు కేంద్రాల్లో పనులను వేగవంతం చేసి వారికి అప్పగించాల్సిందిగా ఇరిగేషన్ ఇతర శాఖలకు కలెక్టర్ సూచించారు.
News February 26, 2025
మహా శివరాత్రి.. కిక్కిరిసిన శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.
News February 26, 2025
నవాబ్ పేట: చికిత్స పొందుతూ కార్మికురాలి మృతి

ఈనెల 14న ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని గాయాల పాలైన గురుకుంట గ్రామపంచాయతీ కార్మికురాలు చెన్నమ్మ(62)చికిత్సపొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. విధులలో భాగంగా కార్మికురాలు చెన్నమ్మ గ్రామంలోని వీధులను ఊడ్చిన చెత్తను అంటిస్తుండగా చీర కొంగుకు నిప్పు అంటుకొని ప్రమాదం సంభవించగా, చికిత్సనిమిత్తం MBNR ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.