News February 26, 2025
గ్రామాల్లో మహిళా పోలీసులు ఇంటింటా అవగాహన కల్పించాలి: ఎస్పీ

గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు వర్క్‌షాప్ నిర్వహించారు. అందరూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు సెల్ ఫోన్, మొబైల్ యాప్స్ ద్వారా జరిగే నష్టాలను వివరించాలన్నారు.
Similar News
News February 26, 2025
నాటుసారా రహిత జిల్లాగా తయారు చేద్దాం: అనంత కలెక్టర్

నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.
News February 26, 2025
శివరాత్రి ఉత్సవాలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

అనంతపురం జిల్లాలో ఇవాళ (బుధవారం) శివరాత్రి ఉత్సవాలు జరగనున్న ప్రధాన శివాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజలందరు శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఆలయాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తే ఏ ఇబ్బందీ లేకుండా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని వెల్లడించారు.
News February 26, 2025
సైబర్ నేరాలపై అవగాహన అవసరం: ఎస్పీ

ప్రజలు సైబర్ మోసాలతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ మోసాలపై వివరించాలన్నారు. అనుమానితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.