News February 26, 2025
పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్

సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. గతంలో ఆయన నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ మొదటి అధికారిగా పనిచేశారు. ఇకనుంచి సంగారెడ్డి పౌర సరఫరాల మేనేజర్‌గా పూర్తి బాధ్యతలు వహించనున్నారు.
Similar News
News November 14, 2025
ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
News November 14, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.