News February 26, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్..

*KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!
*94 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగం@ KMR
* MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: KMR ఎస్పీ
*పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్
*మైనర్లకు కల్లు విక్రయించొద్దు: కామారెడ్డి ASP
*వచ్చే నేల 8 న లోక్ అదాలత్..
* మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు..
* శివరాత్రి..జోరుగా పండ్ల విక్రయాలు
* పది పరీక్షలు ఎంత మంది రాయనున్నారంటే..?
Similar News
News February 26, 2025
మహా శివరాత్రి.. కిక్కిరిసిన శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.
News February 26, 2025
నవాబ్ పేట: చికిత్స పొందుతూ కార్మికురాలి మృతి

ఈనెల 14న ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని గాయాల పాలైన గురుకుంట గ్రామపంచాయతీ కార్మికురాలు చెన్నమ్మ(62)చికిత్సపొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. విధులలో భాగంగా కార్మికురాలు చెన్నమ్మ గ్రామంలోని వీధులను ఊడ్చిన చెత్తను అంటిస్తుండగా చీర కొంగుకు నిప్పు అంటుకొని ప్రమాదం సంభవించగా, చికిత్సనిమిత్తం MBNR ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
News February 26, 2025
MNCL: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో రామటెంకి బాణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాణేశ్‌కు 2022లో గుండెకు స్టంట్స్ వేశారు. రెండో భార్య పుష్ప వివాహేతర సంబంధం విషయంలో గొడవలు కావడంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదై జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో అప్పులుకావడంతో భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నారు.