News February 26, 2025
వైభవంగా శివయ్య బ్రహ్మోత్సవం(PHOTOS)

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జున స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.
Similar News
News February 26, 2025
నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. అపాయింట్‌మెంట్ అందడంతో రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చివరిసారి గతేడాది జులైలో ఆయన పీఎంతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన SLBC ప్రమాదంపై మోదీ ఆరా తీసే అవకాశం ఉంది. అటు మూసీ సుందరీకరణ, శంషాబాద్ వరకు మెట్రోరైల్, RRR నిర్మాణం సహా విభజన చట్టంలోని పెండింగ్ పనులు, నిధులపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.
News February 26, 2025
శివరాత్రి: ఇవాళ ఇలా చేస్తే..

శివ పదమణి మాల ప్రకారం శ అంటే శివుడు. వ అంటే శక్తి అని అర్థం. శివ అంటే శుభపద్రం, మంగళకరం, శ్రేయస్కరం అనే అర్థాలు ఉన్నాయి. శివరాత్రి వేళ ఎవరైతే లింగాన్ని పూజిస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. స్పటిక లేదా వెండి లింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
News February 26, 2025
మహా శివరాత్రి.. కిక్కిరిసిన శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.