News February 26, 2025

అనకాపల్లి: చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమ్మికూడి ఉండరాదని అన్నారు. పై ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 6, 2025

HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

image

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 6, 2025

వనపర్తి: ప్రతి నెల గ్రామసభలు నిర్వహించాలి

image

గ్రామస్థాయి అధికారులు ప్రతినెల గ్రామసభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి తరుణ్ సూచించారు. గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామ సభల ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని ఆయన సూచించారు.

News November 6, 2025

HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

image

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)‌ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.