News February 26, 2025

MBNR: ప్రతి కళాశాలలో యాంటిడ్రగ్స్ కమిటీలు: అదనపు కలెక్టర్

image

జిల్లాలోని జూనియర్ కళాశాలలు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులకు సూచించారు. మంగళవారం తన ఛాంబర్‌లో మాదకద్రవ్యాలు, సైకో ట్రోపిక్ పదార్థాల నియంత్రణపై సమీక్షించారు. వీటి నియంత్రణకు ప్రతి కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలను నియమించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 26, 2025

జడ్చర్లలో యువకుడి హత్య

image

జడ్చర్ల పరిధిలో అనుమానాస్పదంగా <<15574517>>యువకుడు <<>>మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి హత్యగా గుర్తించారు. కాగా, బాత్‌రూం పక్కన ఉన్న గదిలో రక్తపు మరకలు రహీద్ ఖాన్‌ అని నిర్ధారించారు. మృతుడి మెడకు గాయం ఉండటంతో ఎవరో హత్య చేసి బాత్‌రూంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News February 26, 2025

నవాబ్‌పేట: చికిత్స పొందుతూ కార్మికురాలు మృతి

image

ఈనెల 14న ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని గాయాల పాలైన గురుకుంట గ్రామపంచాయతీ కార్మికురాలు చెన్నమ్మ(62)చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. విధులలో భాగంగా కార్మికురాలు చెన్నమ్మ గ్రామంలోని వీధులను ఊడ్చిన చెత్తను అంటిస్తుండగా చీర కొంగుకు నిప్పు అంటుకుంది. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం MBNR ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. 

News February 26, 2025

MBNR: పునరావాస పనుల్ని వేగవంతం: కలెక్టర్

image

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసపనుల్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఉదండపూర్ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల పునరావాస పనులపై సమీక్షించారు. ఆయా శాఖల ద్వారా పునరావస్తు కేంద్రాల్లో పనులను వేగవంతం చేసి వారికి అప్పగించాల్సిందిగా ఇరిగేషన్ ఇతర శాఖలకు కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!