News March 21, 2024
టేక్మాల్: మహిళా హత్య !

టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామంలో దుబ్బగళ్ళ సంగమ్మ(44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొద్ది నెల క్రితం భర్త మృతిచెందగా.. కొడుకు హైదరాబాదులో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి ఇంట్లో పడుకున్న సంగమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
Similar News
News October 25, 2025
మెదక్: సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ శిక్షణ

గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో చెందిన యువతకు 15 రోజులపాటు ఉచిత శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 24, 2025
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మెదక్ కలెక్టర్

భూభారతి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించడానికి జిల్లాలో నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పది రోజుల్లో సుమారుగా వెయ్యి భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్ ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిరోజు ఒక్కో తహశీల్దార్ పది ఫైల్స్ క్లియర్ చేసి ఆర్డీవోలకు పంపించాలని తెలిపారు.
News October 24, 2025
అన్ని శాఖల అధికారులు ఫైల్స్ ఈ-ఆఫీసులోనే పంపాలి: మెదక్ కలెక్టర్

అన్ని శాఖల అధికారులు ఫైల్స్‌ను ఈ- ఆఫీసులోనే పంపాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,031 ఫైల్స్‌ను ఈ-ఆఫీసులో క్లియర్ చేశామన్నారు. మెదక్ జిల్లాలో అన్ని శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి, ఫైల్స్‌ను ఎవరూ కూడా తారుమారు చేయడానికి వీలు లేకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ-ఆఫీస్ ప్రారంభించి అమలు చేస్తున్నామన్నారు.


