News February 26, 2025

ఎన్నికల్లో జోనల్ అధికారులపాత్ర కీలకం: జిల్లా

image

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు, సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News November 11, 2025

గద్వాల: ‘పాఠశాలలను శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత’

image

పాఠశాలలను శుభ్రంగా, సురక్షితంగా, బాలికలకు అనుకూలంగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ బి. నర్సింగ రావు పేర్కొన్నారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వజ్ర ఫంక్షన్ హాల్‌లో డీఆర్‌డీఏ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కిశోర బాలికల సమస్యలు, పాఠశాలల్లో వాష్ (WASH – Water, Sanitation & Hygiene) అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

News November 11, 2025

నటి సాలీ కిర్క్‌ల్యాండ్ కన్నుమూత

image

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్‌ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.

News November 11, 2025

RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

image

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <>https://rbi.org.in/<<>>లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డిసెంబర్ 6న ఫేజ్-2 ఎగ్జామ్ జరగనుంది. అందులోనూ సెలక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.