News February 26, 2025
భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి

రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్దీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.
Similar News
News January 8, 2026
కోడి పందేలు జరగకుండా చూడాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో జిల్లా జంతు హింస నివారణ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి, ఎడ్ల పందేలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు.
News January 8, 2026
నెల్లూరు: బంగారం కోసం హత్య

కొడవలూరు (M) కొత్త వంగల్లు గ్రామంలో ఈనెల 5న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ కోటేశ్వరమ్మ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల వెల్లడించారు. కోటేశ్వరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వేముల రంజిత్ కుమార్ రాయితో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు సరుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుడు రికవరీ చేశారు.
News January 8, 2026
నెల్లూరు: రూ.14.22 కోట్లను ప్రభుత్వం రాబట్టలేదా..?

నెల్లూరు జిల్లాలో గనుల తవ్వకాల పన్ను(సీనరేజ్) వసూళ్ల కాంట్రాక్టర్ను AMR సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ప్రభుత్వానికి నెలకు రూ.14.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎక్కడికక్కడ AMR చెక్పోస్ట్లు పెట్టి రూ.30కోట్లకు పైగా వసూళ్లు చేస్తోందని సమాచారం. కానీ ప్రతినెలా ప్రభుత్వానికి సరిగా సీనరేజ్ కట్టడం లేదని తెలుస్తోంది. జనవరి ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉందని DD శ్రీనివాసరావు Way2Newsకు తెలిపారు.


