News February 26, 2025
మండలానికి ఒక గ్రామంలో ప్రకృతి వ్యవసాయం: కలెక్టర్

ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ అధికారులతో ప్రకృతి వ్యవసాయం లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయానికి వనరులు గల గ్రామాలను ముందుగా గుర్తించాలన్నారు. దీనికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
Similar News
News February 26, 2025
భువనగిరి: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ <<15576453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
News February 26, 2025
మహాకుంభమేళా ‘సిత్రాలు’

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్య స్నానమాచరించారు. ఈ క్రమంలో పలు ఫొటోలు వైరలయ్యాయి. పైన స్వైప్ చేసి ఫొటోలను చూడొచ్చు.
News February 26, 2025
తాళ్లపూడి: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

ఉమ్మడి తూ.గో.జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా గోదావరిలోకి స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.