News February 26, 2025
SRPT: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: SP

ఈనెల 27న జరగనున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఎన్నికల సామాగ్రి రక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి, అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మొత్తం 23 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 26, 2025
నరసాపురం : మహిళ కడుపులో ఏడు కేజీల కణితి

నరసాపురం మండలం సారవ గ్రామానికి చెందిన మహిళ కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో దాదాపు ఏడు కేజీల కణితి ఉందని నిర్ధారించారు. మంగళవారం మహిళకి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఏడు కేజీల కణితిని తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని గైనకాలజిస్ట్ డా.అద్దంకి విజ్ఞాని తెలిపారు.
News February 26, 2025
BREAKING: వేములవాడకు పోటెత్తారు..!

వేములవాడలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతర నేపథ్యంలో ఈరోజు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడకు వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆలయంలోని క్యూలైన్ల కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తుండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఆలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగుతోంది.
News February 26, 2025
సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున జిల్లాలో ఎక్కడైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా పార్టీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. బల్క్ ఎస్ఎంఎస్‌లు కూడా పంపవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.