News February 26, 2025
వరంగల్: రైతన్నలు సిద్ధంగా ఉన్నారు: మాజీ MLA

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మిర్చి పంట ధరలు పడిపోయి రైతన్నలు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఎనుమముల మార్కెట్‌ను సందర్శించి రైతన్నల కష్టాలను అడిగి తెలుసుకున్నామన్నారు.
Similar News
News January 4, 2026
హాల్టికెట్లలో మార్పులుంటే చేసుకోవచ్చు: డీఐఈవో

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.
News January 4, 2026
WGL: మున్సిపల్ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ..!

మున్సిపల్ ఎన్నికల పోరు సిద్ధమవుతోందన్న సంకేతాలు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..? అనే చర్చ జరుగుతోంది.
News January 4, 2026
వరంగల్ జిల్లాలో యూరియా కొరత లేదట..?

జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటలకు సరిపడా నిల్వలు ఉన్నాయని WGL జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 1,11,435 ఎకరాల్లో సాగు జరగగా 3,56,392 బస్తాల యూరియా సరఫరా చేశామన్నారు. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.


