News February 26, 2025

దస్తూరాబాద్‌: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్

image

దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గోండుగూడెం గ్రామానికి చెందిన పుర్క జగన్ (45) మంగళవారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అప్పుల పాలు కావడంతో మంగళవారం పుర్క జగన్ తన నివాసంలో గుర్తు తెలియని పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు SI నమోదు చేశారు.

Similar News

News January 7, 2026

రన్నింగ్ vs వెయిట్ లిఫ్టింగ్.. ఏది బెటరంటే?

image

రన్నింగ్ మేలా లేక వెయిట్ లిఫ్టింగ్ బెటరా? అనే ప్రశ్నకు ప్రముఖ వైద్యుడు సుధీర్ సమాధానమిచ్చారు. ‘దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం రెండింటినీ చేయడం బెటర్. శాస్త్రీయంగా చూస్తే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణలో రన్నింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వృద్ధాప్యంలో కండరాలు, ఎముకల దృఢత్వానికి వెయిట్ లిఫ్టింగ్ అత్యవసరం. అయితే ఈ రెండింటినీ చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ & క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు’ అని తెలిపారు.

News January 7, 2026

పాక్‌లో ఓపెన్ టెర్రర్ క్యాంపులు: జైశంకర్

image

పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. అది ఏదో రహస్యంగా చేసే పని కాదని, ఆ దేశంలోని పెద్ద నగరాల్లోనే బహిరంగంగా టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. దీనికి ఆ దేశ సైన్యం పూర్తి మద్దతు ఉందన్నారు. పాక్ తీరు వల్ల ఆ దేశంతో సంబంధాలు ఎప్పటికీ ఓ మినహాయింపు అని, ఈ చేదు నిజం ఆధారంగానే భారత్ తన పాలసీలను రూపొందిస్తోందని స్పష్టం చేశారు.

News January 7, 2026

నిజామాబాద్ జిల్లా జైలర్‌ సస్పెండ్

image

నిజామాబాద్ జిల్లా జైలర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల సారంగాపూర్ జిల్లా జైలులో గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ, డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలర్ పూర్ణచందర్‌కు నిజామాబాద్ అదనపు బాధ్యతలు అప్పగించారు.