News February 26, 2025
చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 26

* 1802- ఫ్రెంచి నవలా రచయిత విక్టర్ హ్యూగో జననం
* 1829- బ్లూ జీన్స్‌ని తొలిసారి రూపొందించిన లెవీ స్ట్రాస్ అండ్ కో ఫౌండర్ లెవీ స్ట్రాస్ జననం
* 1932- సామాజిక కార్యకర్త హేమలతా లవణం జననం
* 1982- మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పుట్టినరోజు
* 1962- ఉమ్మడి ఏపీ శాసనసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు మరణం
* 1966- అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ మరణం(ఫొటోలో)
Similar News
News February 26, 2025
పాండవులు నిర్మించిన క్షేత్రం కేదార్‌నాథ్

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉత్తరాఖండ్‌లోని <<15578815>>కేదార్‌నాథ్<<>> క్షేత్రం 11వది. మహాభారత యుద్ధం తర్వాత వ్యాసమహర్షి సలహా ప్రకారం, పాండవులంతా కేదార్‌నాథ్ వెళ్లి శివుని ఆలయం నిర్మించి, క్షమాపణ కోరుతూ తపస్సు చేశారని స్థలపురాణం చెబుతోంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడే నిర్వాణం పొందారు. విపరీతమైన మంచు కారణంగా ఈ మందిరం ఏప్రిల్- నవంబర్‌ల మధ్యే తెరిచి ఉంటుంది. కాలినడకన, గుర్రాలు, డోలీలపై ఈ ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
News February 26, 2025
శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

మహాశివరాత్రి కోసం ముస్తాబైన ఆలయం నుంచి శివలింగాన్ని దొంగిలించిన ఘటన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో జరిగింది. అరేబియా సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న పురాతన శివలింగాన్ని నిన్న దొంగలు ఎత్తుకెళ్లారు. లింగం కనిపించకపోవడంతో ఆలయ అధికారులు స్కూబా డైవర్లతో సముద్రంలో గాలిస్తున్నారు. శివరాత్రి ముందు రోజే ఇలా జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 26, 2025
ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

TG: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్, ఇతర ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. CM వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. ఈ ఏడాదిలో ప్రధానితో రేవంత్ భేటీ కావడం ఇదే తొలిసారి.