News February 26, 2025

సిద్దిపేట: ‘రాబోయేది నానో తరం’

image

రాబోయేది నానో తరమని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి రాధిక పేర్కొన్నారు. మంగళవారం నానో యూరియా, డీఏపీ వినియోగంపై ఫర్టిలైజర్ డీలర్లు, ఎఫ్పీసీ సంఘం సభ్యులకు సిద్దిపేటలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ యూరియా, డీఏపీ స్థానంలో ఇఫ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నానో యూరియా, డీఏపీ వినియోగం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు వస్తున్నాయన్నారు.

Similar News

News February 26, 2025

ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

image

TG: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్‌, ఇతర ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. CM వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. ఈ ఏడాదిలో ప్రధానితో రేవంత్ భేటీ కావడం ఇదే తొలిసారి.

News February 26, 2025

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల పెంపు!

image

ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచినట్లు సమాచారం. మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి గరిష్ఠంగా 20% వరకు హైక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు కేటగిరీల్లో 5-7%, 7-10%, 10-20% మేర పెంచినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతేడాది నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ఇప్పటికే వారికి లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల ట్రైనీ ఉద్యోగులను నిర్దయగా తొలగించిందని సంస్థపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

News February 26, 2025

నర్సీపట్నంలో అల్లూరి జిల్లా వాసి మృతి

image

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పనసల చంద్రశేఖర్‌ ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం వద్ద కాలేజీ బ్యాగ్ దొరికిందని పోలీసులు తెలిపారు. అందులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

error: Content is protected !!