News February 26, 2025
కురవిలో జాతర START

కురవిలోని శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణానికి మంగళవారం అర్చకులు, అంకురార్పణ పూజాకార్యక్రమం నిర్వహించారు. బుధవారం జరిగే స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కళ్యాణం కాగానే పురవీధుల గుండా, ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
Similar News
News February 26, 2025
ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవే

1.సోమనాథ్ (గుజరాత్) , 2.మల్లికార్జున (శ్రీశైలం), 3.మహాకాళ ( మధ్యప్రదేశ్) ,4. ఓంకారేశ్వర (మధ్యప్రదేశ్), 5.వైద్యనాథ్ (ఝార్ఖండ్), 6.భీమశంకర (మహారాష్ట్ర), 7. రామేశ్వరం (తమిళనాడు), 8.నాగేశ్వర (గుజరాత్),9. విశ్వేశ్వర (ఉత్తరప్రదేశ్), 10.త్రయంబకేశ్వర్ (మహారాష్ట్ర),11. కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) 12. ఘృష్ణేశ్వరం (మహారాష్ట్ర)
News February 26, 2025
SRPT: బాలికపై అటెండర్ లైంగికదాడి.. 20ఏళ్ల జైలు శిక్ష

బాలికపై ఓ ప్రైవేట్ పాఠశాల అటెండర్ లైంగిక దాడి చేసిన ఘటనకు సంబంధించి HYD చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం కేసు నమోదైంది. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల సుధాకర్ దోషి అని తేలడంతో పొక్సో చట్టప్రకారం రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్డు న్యాయమూర్తి అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష, 25వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాధిత చిన్నారికి రూ.8లక్షల పరిహారం మంజూరు చేశారు.
News February 26, 2025
స్కామర్లపై జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం: ఎస్పీ

స్కామర్లపై జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీకు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా ఇతర సంస్థల నుంచి వచ్చినట్లు చెప్పుకునే కాల్‌లను అనుమానించాలన్నారు.