News February 26, 2025

జనసేన ఆవిర్భావ వేడుకలు.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఈయనే..!

image

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్నూలు పార్లమెంటుకు చింతా సురేశ్ నియమితులయ్యారు. కాగా, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

Similar News

News January 17, 2026

కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

image

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.

News January 17, 2026

కర్నూలు: భార్యను వదిలేసిన టీచర్‌కు రిమాండ్!

image

DSC కోచింగ్‌లో పరిచయమైన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేసిన సంజామల(M) ఆకుమల్లకు చెందిన టీచర్ కలింగిరి మహేశ్‌ను కోవెలకుంట్ల కోర్టు 14రోజుల రిమాండ్‌కు పంపింది. కర్నూలు(D) సి.బెళగల్(M) కంబదహాల్‌కు చెందిన సారమ్మతో రెండేళ్లు సహజీవనం చేసి ఉద్యోగం రాగానే దూరం పెట్టాడు. యువతి ఒత్తిడితో ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేశాడు. దీంతో యువతి సంజామల పోలీసులను ఆశ్రయించింది.

News January 17, 2026

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

image

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.