News March 21, 2024

కడప రైల్వే స్టేషన్‌లో 4 కిలోల గంజాయి స్వాధీనం

image

కడప రైల్వే స్టేషన్ లో ప్రొద్దుటూరుకు చెందిన షేక్ జాఫర్ అనే వ్యక్తి వద్ద నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కడప రైల్వే ఇన్స్పెక్టర్ నాగార్జున తెలిపారు. రైల్వే స్టేషన్‌లో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా జాఫర్ అనుమానాస్పదంగా కనిపించాడని తెలిపారు. ఒక్కొక్కటి రెండు కిలోలు చొప్పున నాలుగు కిలోలు గంజాయి బండిల్స్ ఉన్నాయని తెలిపారు. గుంతకల్లు రైల్వే కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Similar News

News April 1, 2026

కడప జిల్లాలో రూ.1,155.81 కోట్ల మద్యం తాగేశారు.!

image

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,155.81 కోట్ల మద్యం తాగేశారు. 16,00,494 కేసుల IML మద్యం, 8,51,147 కేసుల బీర్లు గుటగుట తాగేశారు. నెలకు సరాసరిన రూ.95.98 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 14,83,675 కేసులు IML మద్యం, 5,10,320 కేసులు బీర్లు అమ్ముడుపోయాయి. రూ.1,169.50 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1 శాతం మద్యం విక్రయాలు తగ్గాయి.

News April 1, 2026

కడప: కోటాను మించి విద్యుత్ వినియోగం.!

image

కడప విద్యుత్ సర్కిల్ (SE) పరిధిలో మార్చి నెలలో విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి నెలకు 427.112 MU కోటా కాగా.. మార్చి 30 వరకు 484.178MU వినియోగం జరిగింది. డివిజన్ వారీగా విద్యుత్ కోటా, వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప-43.410-70.587 MU
➤ పులివెందుల-72.270-82.467 MU
➤ ప్రొద్దుటూరు-136.890-117.650 MU
➤ మైదుకూరు-59.169-82.462 MU
➤ రాజంపేట-62.576-75.763 MU
➤ రాయచోటి-52.806-55.249 MU.

News April 1, 2026

ఒంటిమిట్ట: కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, టీటీడీ జేఈవో వీ.వీరబ్రహ్మం మంగళవారం పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.