News February 26, 2025
MNCL: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో రామటెంకి బాణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాణేశ్‌కు 2022లో గుండెకు స్టంట్స్ వేశారు. రెండో భార్య పుష్ప వివాహేతర సంబంధం విషయంలో గొడవలు కావడంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదై జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో అప్పులుకావడంతో భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నారు.
Similar News
News September 17, 2025
17 నుంచి పోషణ మాసొత్సవాలు: సీతక్క

జీవనశైలి మార్పుల సవాళ్లు ఎదుర్కొనేందుకు పోషకాహారం ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో కేంద్ర సమాచార శాఖ ఫొటో ఎగ్జిబిషన్, పోషణ మాసోత్సవాలను ఆమె ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జిల్లాలో పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
News September 17, 2025
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.