News February 26, 2025
మహా శివరాత్రి.. కిక్కిరిసిన శ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల తాకిడి మొదలైంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని తె.జా 2.30 గంటల నుంచి అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. దీంతో పవిత్రమైన రోజున పరమశివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి నంది వాహన సేవ, మల్లికార్జునుడి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహిస్తారు.
Similar News
News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.
News February 26, 2025
ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో?: BRS

TG: CM రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్-BJP సంకీర్ణ సర్కార్ అని BRS ఆరోపించింది. ‘MLC ఎన్నికల ఓటింగ్‌కు ముందు రోజు BJP ప్రధానిని, కాంగ్రెస్ CM కలవడంలో మర్మం ఏంటి? మేము గెలిచినా ఓడినా మాకు ఏమి ఫరక్ పడదు అని CM అనడంలో మతలబు ఏంటి? ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో? మోదీ అపాయింట్మెంట్ సులువుగా దొరకడం ఏమిటో రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో?’ అంటూ పీఎం, సీఎం భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.
News February 26, 2025
CT: గెలిస్తేనే నిలుస్తారు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టుకే సెమీస్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం, సాదిక్, రహ్మత్, హస్మత్, అజ్మత్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్, నూర్, ఫరూఖీ
ఇంగ్లండ్: డకెట్, సాల్ట్, స్మిత్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్ స్టోన్, ఓవర్టన్, ఆర్చర్, రషీద్, వుడ్.