News February 26, 2025
నాటుసారా రహిత జిల్లాగా తయారు చేద్దాం: అనంత కలెక్టర్

నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.
Similar News
News January 20, 2026
ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
News January 20, 2026
జేఎన్‌టీయూ-ఏ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో నిర్వహించిన M.Tech (R21), M.Sc (R21) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం www.jntuaresults.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News January 20, 2026
అనంతపురం: ఉద్యోగుల వైద్య శిబిరానికి స్పందన

అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కాగా ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌తోపాటు కలెక్టరేట్, రెవెన్యూ, సర్వే ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.


