News February 26, 2025
NRPT: ఆటోలకు నంబర్ కోడ్ ఏర్పాటు చేయాలి: ఎస్పీ

స్థానికులను తరలించే ఆటోలకు నంబర్ కోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీసులు, ఆర్టీవో అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అధికమొత్తంలో విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్లవద్దని చెప్పారు.
Similar News
News October 19, 2025
మహిళలను వేధిస్తున్న 44 మంది అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 44 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశాయి. 12 మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని DCP సృజన కర్ణం తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో ఆరుగురు ట్రాంజెండర్స్‌తోపాటు 12 మంది సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. CP ఆదేశాల మేరకు ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలన్నారు.
News October 19, 2025
పెద్దేముల్: రూ.2 వేల కోసం హత్య

పెద్దేముల్ మండలంలో 2023లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాండూర్ DSP తెలిపిన వివరాలిలా.. బాలాజీకి ఇచ్చిన రూ.2,050ను తిరిగి ఇవ్వాలని మన్సాన్‌పల్లికి చెందిన రవి(39) గ్రామస్థుల ముందు గట్టింగా అడిగాడు. దీంతో బాలాజీ అవమానంగా భావించాడు. మద్యం తాగించి కత్తితో పొడవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి చనిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
News October 19, 2025
ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply