News February 26, 2025

జలవనరులను భద్రంగా నిల్వ చేసుకోవాలి: బాపట్ల కలెక్టర్

image

వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు జలవనరులను భద్రంగా నిల్వ చేసుకోవాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. జల వనరుల సంరక్షణ, సరఫరాపై అధికారులతో మంగళవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని తాగునీటి చెరువులన్నింటినీ నూరు% నింపాలన్నారు.

Similar News

News February 26, 2025

మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్!

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.

News February 26, 2025

ఏడుపాయల బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

image

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.

News February 26, 2025

వరంగల్: ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

image

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నగరంలోని ములుగురోడ్డు సమీపంలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ విద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత(20) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!