News February 26, 2025
గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పదేళ్లు జైలుశిక్ష..!

యువతిని మోసగించి గర్భవతిని చేశాడనే అభియోగంపై నమోదు చేసిన కేసులో నిందితునికి పదేళ్లు జైలు శిక్ష రూ.5 వేలు జరిమానా విధించినట్లు అడ్డతీగల సీఐ నరసింహుమూర్తి తెలిపారు. పాత రామవరం గ్రామానికి చెందిన యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసగించాడు. విచారణలో నేరారోపణ రుజువు కావడంతో రాజమహేంద్రవరం ఎనిమిదవ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు వెల్లడించారని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2025
అనకాపల్లి జిల్లాలో రేపు సెలవు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెలవు ఇవ్వాలని తెలిపారు. నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఉపాధ్యాయులు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News February 26, 2025
నేను BRSలోనే ఉన్నా: గద్వాల్ ఎమ్మెల్యే

TG: తాను BRSలోనే ఉన్నానని గద్వాల్ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నట్లు కొందరు ఫ్లెక్సీలు వేసి అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై గద్వాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో చేరి మళ్లీ బీఆర్ఎస్ గూటికి వచ్చిన విషయం తెలిసిందే.
News February 26, 2025
వరంగల్: ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నగరంలోని ములుగురోడ్డు సమీపంలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ విద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత(20) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.