News February 26, 2025
ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉ.6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జకర్తా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2018లో సులవేసిలో భారీ భూకంపంతో 2,200 మంది, 2021 జనవరిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నిన్న కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది.
Similar News
News February 26, 2025
క్రిమినల్ పొలిటీషియన్స్‌పై ఆరేళ్ల నిషేధం చాలు: కేంద్రం

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలినవారు ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్ల నిషేధం చాలని కేంద్రం అభిప్రాయపడింది. జీవితకాలం అనర్హత వేటు వేయడం కఠినమని సుప్రీంకోర్టుకు తెలిపింది. అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌పై స్పందించింది. ‘జీవితకాల నిషేధం సముచితం అవునో, కాదోనన్న ప్రశ్న పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దానిని సభ నిర్ణయిస్తుంది. ప్రస్తుత శిక్షాకాలం సరైందే. నేర నియంత్రణకు సరిపోతుంది’ అని పేర్కొంది.
News February 26, 2025
కేసీఆర్‌కు కిషన్ రెడ్డి పార్ట్‌నర్: CM రేవంత్

TG: KCRకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్‌నర్ అని CM రేవంత్ అన్నారు. ‘KCR కోసమే కిషన్ రెడ్డి పని చేస్తున్నారు. నాకు పేరొస్తుందని మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు’ అని ఆరోపించారు. SLBC టన్నెల్ ప్రమాదంపై మాట్లాడుతూ ‘పదేళ్ల నుంచి పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో 30కి.మీ మేర టన్నెల్ పూర్తయింది. తర్వాత తనకు లాభాలు రావడం లేదని KCR పనులను ఆపేశారు’ అని పేర్కొన్నారు.
News February 26, 2025
సినీ నిర్మాత మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

TG: సినీ నిర్మాత కేదార్ <<15577363>>మృతిని<<>> KTRకు ముడిపెడుతూ CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా పలువురు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని సందేహం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, ఆ తర్వాత రాజలింగ మూర్తి, KTR సన్నిహితుడు కేదార్ చనిపోయారని తెలిపారు. ఈ మిస్టీరియస్ మరణాలపై ఆయన ఎందుకు స్పందించలేదని, విచారణ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కేదార్ డ్రగ్స్ కేసులో నిందితుడని మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.