News February 26, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు టోల్ ఫ్రీ నెంబర్లు: కలెక్టర్

తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్ల సౌలభ్యం నిమిత్తం హెల్ప్ లైన్ నంబర్లను ఏలూరు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేశామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 1950, 949-104-1419, టోల్ ఫ్రీ నంబర్ 18002331077 లను ఎన్నికల ఓటర్లు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 7, 2025
చర్చలు సఫలం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా కాలేజీలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే.
News November 7, 2025
కాగజ్‌నగర్: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కుమురం భీం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్‌లు ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 8,600 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
News November 7, 2025
కల్వకుర్తిలో కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

ఈ నెల 9న కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. 2006 తర్వాత జన్మించిన, 75 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.


