News February 26, 2025
SRPT: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

గరిడేపల్లి మండలం గానుగబండ పంచాయతీ కార్యదర్శి ఇంద్రబాబును కలెక్టర్ తేజస్ నందన్ లాల్ సస్పెండ్ చేశారు. ఇటీవలే హుజూర్‌నగర్‌లో నిర్వహించిన భగీరథ నీటి సమీక్ష సమావేశంలో గానుగబండలో భగీరథ నీటి సరఫరా విషయమై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యదర్శి ఇచ్చిన వివరణలో పొంతనలేని సమాధానాలు ఉన్నాయని మంగళవారం అతణ్ని సస్పెండ్ చేశారు.
Similar News
News November 8, 2025
కనిగిరిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కనిగిరిలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కూచిపూడిపల్లికి చెందిన జొన్నలగడ్డ సృజన్ (52) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
News November 8, 2025
జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.


