News February 26, 2025
వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 12, 2025
కిడ్నీలు దొంగిలించే ముఠాలో ప్రధానమైనవారు వీరే.!

కిడ్నీలు దొంగిలించే రాకెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న పెళ్లి పద్మ – కాకర్ల సత్య, వెంకటేశ్వర్ల కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం ఏడాది కాలంగా సాగుతున్నట్లు సమాచారం. బాంబేకి చెందిన ఓ మహిళా డాక్టర్ మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్‌కు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోందని తెలిసింది.
News November 12, 2025
ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు రద్దు

కార్తీకమాసం ముగింపు నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ టిక్కెట్ల విక్రయం నిలిపివేయబడుతుందని తెలిపారు.
News November 12, 2025
ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


