News February 26, 2025
శ్రీశైలంలో విషాదం.. తండ్రీకొడుకులు మృతి

శివరాత్రి వేళ శ్రీశైలంలో విషాద ఘటన జరిగింది. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న కృష్ణా నదిలో స్నానమాచరిస్తూ తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. ఓ వ్యక్తి భార్య, కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతడిని కాపాడే ప్రయత్నంలో ఇరువురూ మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 19, 2026
సైబర్ నేరగాళ్ల APK లింకులతో జాగ్రత్త

గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, జిల్లా ఇన్‌ఛార్జి SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
News January 19, 2026
కర్నూలులోనే ఎఫ్‌సీఐ కార్యాలయం: ఎంపీ నాగరాజు

కర్నూలులోని FCI డివిజనల్ కార్యాలయం ఎక్కడికీ తరలిపోదని MP బస్తిపాటి నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం ఎఫ్‌సీఐ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు. కార్యాలయాన్ని అనంతపురానికి తరలించే ప్రతిపాదన లేదని అన్నారు. చెన్నైలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్యాలయం కర్నూలులోనే ఉండాలని కోరగా కమిటీ సానుకూలంగా తీర్మానించిందని వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
News January 19, 2026
కర్నూలు కలెక్టరేట్‌లో 270 ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు మొత్తం 270 అర్జీలు అందినట్లు డీఆర్వో వెంకట నారాయణమ్మ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 167 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన ఈ అర్జీలను ఆయా శాఖల వారీగా వర్గీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.


