News February 26, 2025

‘మజాకా’ మూవీ రివ్యూ

image

త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ థియేటర్లలో విడుదలైంది. తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
WAY2NEWS RATING: 2.25/5

Similar News

News February 26, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ స్కోర్ చేసిన అఫ్గాన్

image

ఇంగ్లండ్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 325/7 స్కోర్ చేసింది. ఇబ్రహీం జద్రాన్ (177) భారీ ఇన్నింగ్స్‌‌తో ENG బౌలర్లకు చెమటలు పట్టించారు. నబీ(40), హస్మతుల్లా (40), అజ్మతుల్లా (41) రన్స్‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ENG 50 ఓవర్లలో 326 రన్స్ చేయాలి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

News February 26, 2025

నార్త్ కొరియాలోకి విదేశీ పర్యాటకులకు అనుమతి?

image

ఐదేళ్ల తర్వాత నార్త్ కొరియా తమ దేశంలోకి విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. పర్యాటకం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ మారక నిల్వలపై దృష్టి పెడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ఆ దేశం విదేశీ పర్యాటకులపై నిషేధం విధించింది. ఇప్పుడు మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తోంది.

News February 26, 2025

చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ప్లేయర్ జద్రాన్

image

అఫ్గానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన ఏకైక అఫ్గాన్ ఆటగాడిగా ఆయన నిలిచారు. WCలో ఆస్ట్రేలియాపై, CTలో ఇంగ్లండ్‌పై శతకాలు బాదారు. మరే అఫ్గాన్ ప్లేయర్ ఈ రెండు మెగా టోర్నీల్లో శతకాలు బాదలేదు. కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో జద్రాన్ (177) సెంచరీతో మెరిశారు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నారు.

error: Content is protected !!