News February 26, 2025

48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు:కలెక్టర్ 

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్‌లో సభలు సమావేశాలు, రాజకీయపరమైన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News January 2, 2026

గన్నవరం: ‘వంశీ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించాలి’

image

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై AP హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ హత్యాయత్నం కేసులో దాఖలైన ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వంశీపై 20 వరకు కేసులు ఉన్నాయని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే ఎన్నికలకు ముందు కేవలం 3 కేసులు మాత్రమే ఉన్నాయని వంశీ తరఫు న్యాయవాది వాదించారు. వాస్తవంగా ఎన్ని కేసులు ఉన్నాయన్న అంశంపై వంశీ తన ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది.

News January 2, 2026

NGRIలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే సమయం

image

హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NGRI)లో 13 సెక్యూరిటీ ఆఫీసర్, MTS పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(జనవరి 5) సమయం ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుకు ఎక్స్‌సర్వీస్‌మన్, ఎంటీఎస్ పోస్టులకు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. వెబ్‌సైట్: https://www.ngri.res.in/

News January 2, 2026

ఈ మార్పులతో 2026ని హెల్తీగా మార్చుకోండి!

image

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ఏడాది హెల్తీగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ప్రతిరోజూ వ్యాయామం, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 7-8 గంటలు నిద్రపోవాలి. జంక్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌‌తో ఒత్తిడి తగ్గించుకోండి. కండరాల బలాన్ని పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చు’ అని వైద్యులు చెబుతున్నారు.