News February 26, 2025

BREAKING: వేములవాడకు పోటెత్తారు..!

image

వేములవాడలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతర నేపథ్యంలో ఈరోజు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడకు వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆలయంలోని క్యూలైన్ల కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తుండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఆలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగుతోంది.

Similar News

News February 26, 2025

కేంద్రం-రాష్ట్రం వివాదం పిల్లల కొట్లాటలా ఉంది: విజయ్

image

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ విషయంలో తమిళనాడుకు, కేంద్రానికి మధ్య వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉందని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎద్దేవా చేశారు. పాలసీ అమలు చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్లు నిలిపివేస్తామనటం అన్యాయమన్నారు. TVK పార్టీ వార్షికోత్సవ సభలో విజయ్ ప్రసంగించారు. BJP, DMK పార్టీలను ‘గెట్ఔట్’ హ్యష్‌ట్యాగ్ పెట్టి సాగనంపాలని పిలుపునిచ్చారు.

News February 26, 2025

WGL: ఈనెల 27న డయల్ యువర్ డీఎం కార్యక్రమం

image

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 27న ఉ.9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు.

News February 26, 2025

ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల 1వ తేదీకి రూ.22,500 కోట్లు అవసరమని, ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పారు. జీతాలకు రూ.6500 కోట్లు, వడ్డీలకు రూ.6800 కోట్లు అవసరమని, ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అటు SLBCలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!