News February 26, 2025
36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.
Similar News
News February 26, 2025
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ప్లేయర్ జద్రాన్

అఫ్గానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన ఏకైక అఫ్గాన్ ఆటగాడిగా ఆయన నిలిచారు. WCలో ఆస్ట్రేలియాపై, CTలో ఇంగ్లండ్‌పై శతకాలు బాదారు. మరే అఫ్గాన్ ప్లేయర్ ఈ రెండు మెగా టోర్నీల్లో శతకాలు బాదలేదు. కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో జద్రాన్ (177) సెంచరీతో మెరిశారు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నారు.
News February 26, 2025
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 66,240 కూలీల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6000 చొప్పున జమ చేసింది. ఇప్పటివరకు మొత్తం 83,420 మందికి రూ.50.65 కోట్లు జమ చేశామంది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా నిధులను చెల్లిస్తామంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 18,231 మందికి జమ చేసినట్లు వెల్లడించింది. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? కామెంట్ చేయండి.
News February 26, 2025
నా సినిమాలో నటించినందుకు ఛాన్సులివ్వట్లేదు: సందీప్

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థపై ఫైరయ్యారు. ‘కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు ఒక నటుడిని ఓ నిర్మాణ సంస్థ తిరస్కరించిందని తెలిసి ఆశ్చర్యపోయా. అతను ఒక చిన్న పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడిషన్ ఇచ్చినందుకు నా సినిమాలో పనిచేసినందుకు తీసుకోవట్లేదని చెప్పడం ఏంటి? వారికి ధైర్యం ఉంటే ఇదే మాట రణ్‌బీర్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మికతో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.