News February 26, 2025
చౌటుప్పల్: రూ.2వేలు ఇస్తే రూ.18,500 అంటూ మోసం!

రూ.2 వేలు ఫోన్‌పే చేస్తే 5 నిమిషాలలో రూ.18,500 ఇస్తామంటూ యువకులను మోసం చేసిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. ఆఫర్ ఇస్తున్నామంటూ ఓ ట్రస్ట్ పేరిట ఉమ్మడి కొయ్యలగూడెం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సందేశం పంపారు. రూ.2 వేలు కడితే రూ.18,500 ఇస్తామన్నారని బాధితులు వాపోయారు.
Similar News
News July 7, 2025
HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.
News July 7, 2025
మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో మార్పులు

లార్డ్స్‌లో ఈనెల 10 నుంచి భారత్‌తో జరిగే మూడో టెస్టుకు ఇంగ్లండ్ 16 మందితో జట్టును ప్రకటించింది. పేసర్ అట్కిన్సన్ స్క్వాడ్‌లోకి వచ్చారు. ఈ మ్యాచులో ENG 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఆర్చర్, అట్కిన్సన్, బెథెల్ తుది జట్టులో ఆడే ఛాన్సుందని ICC అంచనా వేసింది.
టీమ్: స్టోక్స్(C), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, రూట్, పోప్, స్మిత్, ఓవర్టన్, బ్రూక్, కుక్, కార్స్, క్రాలీ, డకెట్, టంగ్, వోక్స్
News July 7, 2025
జగిత్యాల జిల్లాలో 66 మంది ఎంపిక

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.