News February 26, 2025
గోదావరిఖని: ‘AIFTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం’

గోదావరిఖనిలో ఇటీవల జరిగిన AIFTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం చేసినందుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు మాతంగి రాయమల్లు మాట్లాడుతూ.. అన్ని వర్గాల కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు చేస్తామన్నారు. నాయకులు గొల్ల అంజయ్య, రత్నకుమార్, రాములు, పోచమల్లు, రామస్వామి, యాకయ్య, పల్లె లింగయ్య, జనగాం చిన్నయ్య ఉన్నారు.
Similar News
News September 19, 2025
అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.
News September 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 19, 2025
మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్ధం: మంత్రులు

TG: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు CM రేవంత్ ఆమోదం లభించగానే ఆధునికీకరణ పనులు ప్రారంభించి.. వందరోజుల్లోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలు తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.